(" రాజమండ్రి రాతలు " సిరీస్ ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట )
ఇది వినటానికి అంత వింపుగా లేకపోయినా , అంతో ఇంతో కంపుగా అనిపించినా ఇందులో జీవిత సత్యం దాగి ఉంది కాబట్టి ఈ అంశం చెపుతున్నా . హార్వర్డ్ లో చదివిన డాక్టరైనా చెప్పేదేమిటంటే మొదటి రుగ్మతకు మందు ఉంది కానీ రెండో రుగ్మతకు మందు లేదని . పైగా రెండింటికీ కార్భో హైడ్రేటుకి , ఫైబర్ కీ ఉన్నంత తేడా ఉందని. పాత రాతి యుగాల నుంచీ మల బద్దకాన్ని వ్యాధిగా పరిగణిస్తే , మల విసర్జన బద్దకాన్ని అనాదిగా మానసిక పరిపక్వత లోపించటంతో పోలుస్తారు . అంటే ఒకరికి వెల్దామన్నా రాదు. ఇంకొకరికేమో వచ్చినా వెల్లబుద్దెయ్యదు. మరి ఈ రెండో లైఫ్ స్టైల్ డిసీజ్ కి మందు లేదా అంటే లేదు కానీ ఈ బద్ధకం వల్ల అపుడో ,ఇపుడో , ఎపుడో జరిగే ఒక ఆపలేని అఘాయిత్యం మాత్రమే పరిష్కార మార్గం చూపుతుంది
( ఎందుకు ఇలా రాయాలనిపించింది అని అడగ గకపోవటం నాకు, మీకు, అందరికీ శ్రేయస్కరం 😊)
No comments:
Post a Comment