Sunday, May 28, 2023

అలవాటులో పొరపాటు ( రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  )

ఈసారి కూడా నన్ను పెంచి పెద్దచేసిన మా ఊరు (అముజూరు) వెళ్లి, మా పిల్లకి ( ఇప్పుడు కొంచెం పెద్దదై ఓ మోస్తరు ఇంగిత జ్ఞానం వచ్చింది కాబట్టి ) నేను చదివిన మా హైస్కూల్ , బోర్డు స్కూల్ ( ఎందుకు అలా అనేవాళ్ళమో నాకు ఇప్పటికీ తెలీదు  ) చూపించి , మాకు ఉండే వసతులు చూపించి ,మా కస్టాలు ఏకరువు పెట్టడం మొదలెట్టానో లేదో మా పిల్ల " బాబోయ్ ఇంక ఆపేయ్ నాన్నోయ్" అని క్లాసు పర్వానికి తెర  దించమని నిరసన ప్రదర్శించింది . మా ఇంటావిడ చదువు కూడా పట్నంలో కాన్వెంట్ చదువేమో , సానుభూతి ప్రదర్శించకపోగా "సదివేవులే పెద్ద కలెట్టరు సదువు " అన్నట్టు చూసేటప్పటికి క్లాసు పర్వానికి నిజంగా తెర దించాల్సి వచ్చింది .

        మా ఊరి గొల్లాలమ్మకి దణ్ణం పెట్టుకుని , ఎదురుగా ఉండే మా మాస్టారి ఇంటికి వెళ్లి కాసేపు మాటాడి , ఇంక వెనక్కి బయలుదేరి వచ్చేస్తుంటే మాస్టారు మా పిల్లతో బాగా చదువుకోవాలి మరి అని అంటుంటే అన్నేళ్ల అలవాటో ఏమో బుర్ర గంగిరెద్దులా ఊపి " బాగా చదువుకుంటాను మాస్టారు " అనేశా . ఇది విన్న ఇంటావిడ ఒకటే నవ్వు . ఆ తర్వాత మనిషి నిరంతర విద్యార్థి అని కవర్ చేశా కానీ పెద్ద లాభం లేకపోయింది .అలవాటులో అదన్నమాట

1 comment:

  1. రామాంజి బాబుMay 29, 2023 at 11:04 AM

    ఇప్పుడు జిల్లా ప్రజా పరిషత్, మండల పరిషత్ అని పిలువబడే వ్యవస్థలు అప్పట్లో జిల్లాబోర్డ్, తాలూకా బోర్డ్ అని పిలిచేవారు. వాటి నిర్వాహణ లో ఉన్న స్కూళ్ళకు బోర్డ్ స్కూళ్ళు అని పేరు వచ్చింది.

    ReplyDelete

పిపీలకములు - (రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  ) అర్ధమైంది . పిపీ...